Share News

బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:07 AM

బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహనరావు అన్నారు.

 బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలి

గరుగుబిల్లి: బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహనరావు అన్నారు. మండల కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌, వైద్య సిబ్బంది, హాస్టల్‌ సిబ్బందితో సమీక్షించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాల రికార్డులు, సిక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. హిమోగ్లోబిన్‌ పరీక్షల నివేదికలను తరగతుల వారీగా పరిశీలించి, రక్తహీనతతో ఉన్న విద్యార్థులకు తీసుకుంటున్న నివారణ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేయిస్తున్నామని, అదే విధంగా బరువు తక్కువగా ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ప్రిన్సిపాల్‌ ఎస్‌.సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌వో బి.చిన్నమ్మి, సూపర్‌వైజర్‌ జయగౌడ్‌, ఎంఎల్‌హెచ్‌వో వెంకటలక్ష్మి, హాస్టల్‌ ఏఎన్‌ఎం స్వర్ణలత, వైద్య సిబ్బంది, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:07 AM