Minister Kondapalli: ఉపాధికి పెద్దపీట వేస్తాం: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:34 PM
Minister Kondapalli: అన్ని రం గాల్లో ఉత్తరాంధ్ర అభివృ ద్ధికి, యువత ఉపాధికి కూ టమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్‌ఆర్‌ఐ సాధికారి త సంబంధాలు శాఖ మం త్రి కొండపల్లి శ్రీనివాస్ తెలి పారు. ఐకమత్యంతో గ్రామాలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలబడాలని కోరారు.
బొండపల్లి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): అన్ని రం గాల్లో ఉత్తరాంధ్ర అభివృ ద్ధికి, యువత ఉపాధికి కూ టమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్‌ఆర్‌ఐ సాధికారి త సంబంధాలు శాఖ మం త్రి కొండపల్లి శ్రీనివాస్ తెలి పారు. ఐకమత్యంతో గ్రామాలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలబడాలని కోరారు. ఆదివారం మండలంలోని బిళ్ళలవలసలో సర్పంచ్ దంపతులు నెట్టి ఏసురత్నం, ముకుంద, మాజీ సర్పంచ్‌లు నెట్టి ఆనందరావు, బూర్లె అనూరాధ, మాజీ ఉప సర్పంచ్ కడగల కొండమ్మ, ముగ్గురు వార్డు సభ్యులతో పాటు 250 కుటుంబాలు, బొం డపల్లి పంచాయతీలోని గొల్లలపేటకు చెందిన పలుకుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు విద్యుత్‌చార్జీలు పెరిగాయని నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ మండలలాధ్యక్షుడు కోరాడ కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ బొడ్డు రాము సర్పం చ్‌లు నంబూరి రాజేష్, కర్రోతు శ్రీనివాసరావు, మీసాల జానకిరావు, ముదునూరు శ్రీనివాస రాజు, పత్తిగుల్ల రాజినాయుడు, సాసుబిల్లి కాశీవిశ్వనాథం, గోపాలరాజు, ముంజేటి పార్వతి పాల్గొన్నారు.