Share News

Milk Supply సక్రమంగా పాలు సరఫరా చేయాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:51 PM

Ensure Proper Milk Supply అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా పాలు సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని ఏపీ డెయిరీ రీజనల్‌ సేల్స్‌ మేనేజరు పి.రామకోటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పాచిపెంటలో మిల్క్‌ స్టాక్‌ పాయింట్‌ను ఆయన పరిశీలించారు.

Milk Supply  సక్రమంగా పాలు సరఫరా చేయాలి
పాచిపెంటలో మిల్క్‌ స్టాక్‌ పాయింట్‌ను పరిశీలిస్తున్న ఏపీ డెయిరీ రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌ రామకోటేశ్వరరావు

పాచిపెంట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా పాలు సరఫరా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని ఏపీ డెయిరీ రీజనల్‌ సేల్స్‌ మేనేజరు పి.రామకోటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం పాచిపెంటలో మిల్క్‌ స్టాక్‌ పాయింట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతినెలా 2.82 లక్షల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ డెయిరీ ఎండీ ఎంఎం నాయక్‌ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రామభద్రపురం, బలిజిపేట మండలాల్లో మిల్క్‌ స్టాక్‌ పాయింట్లును పరిశీలించామన్నారు. పౌష్టికాహారంలో భాగంగా చిన్నారులకు క్రమం తప్పకుండా పాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వజ్ర ప్రైవేట్‌ సంస్థ ద్వారా పాలు సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులుండగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 90 లక్షల లీటర్ల మిల్క్‌ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Dec 27 , 2024 | 11:51 PM