Share News

ఆదాయం ఉన్నా.. అభివృద్ధి లేదు

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:11 AM

ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన సంగమేశ్వరస్వామి ఆలయం వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. ఈ ఆలయానికి 42 ఎకరాల భూములు ఉన్నా ఇక్కడ కనీస వసతులు కొరవడ్డాయి. ప్రధానంగా ప్రజాప్రతినిధులు తమ మాటే నెగ్గాలన్న పంతం పుణ్యమాని అభివృద్ధి గాడితప్పింది.

ఆదాయం ఉన్నా..  అభివృద్ధి లేదు
అధ్వానంగా ఉన్న ఆలయానికి వెళ్లే దారి

వంగర, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన సంగమేశ్వరస్వామి ఆలయం వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. ఈ ఆలయానికి 42 ఎకరాల భూములు ఉన్నా ఇక్కడ కనీస వసతులు కొరవడ్డాయి. ప్రధానంగా ప్రజాప్రతినిధులు తమ మాటే నెగ్గాలన్న పంతం పుణ్యమాని అభివృద్ధి గాడితప్పింది. ఆలయ అభివృద్ధికోసం దాతలు ముందుకువచ్చినా వారికి గౌరవం లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆలయానికి సంబంధించి కోట్ల రూపాయలు నగదు, భూములు ఉన్నప్పటికి వాటిని ఖర్చు చేసేందుకు దేవాదయశాఖ అధికారుల నుంచి అనుమతులు రావడంలేదు. ప్రధానంగా ఆలయానికి రూ.ఎనిమిది లక్షల వరకూ ఆదాయం రావల్సిఉన్నా, రూ.రెండు లక్షలు మాత్రమే చూపిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. దీనికితోడు కార్తీకం, మహాశివరాత్రి, మాఘమాసంలో ప్రసాదాల విక్రయం, టిక్కెట్ల ద్వారా రూ.పది లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ఎనిమిది మంది అర్చకులు, ఈవో, అకౌంటెంట్‌ ఉన్నా కనీస వసతుల కల్పనపై దృష్టిసారించడంలేదని భక్తులు వాపోతున్నారు.

సమస్యల పాగా..

ఫ ప్రధానంగా కనీసం తాగడానికి నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. ఫ కేశఖండన శాలలో నీటి సౌకర్యం లేకపోవడంతో తలనీలాలు సమర్పించిన అనంతరం భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఫ ఆల యంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం వచ్చే నీరు బయటకు వెళ్లే కాలువ దెబ్బతినడంతో నిల్వ ఉంటోంది. దీంతో దుర్వా సన వెలుడుతోంది. ఫ మరుగు దొడ్లు లేకపోవడంతో ఆరుబయట, ఏటి ఒడ్డున మలవిసర్జనకు వెళ్లా ల్సి వస్తోందని భక్తులు వాపోతు న్నారు. ఫ ఆలయం ముందు భాగంలో దీపాలు వెలిగిస్తుండ డంతో భక్తులు నడిచేందుకు ఇబ్బందిపడుతున్నారు. అక్కడ నేలపై నూనే పడేసమయంలో భక్తులు జారిప డిపోతున్నారు. మరోచోట దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫ భక్తులకోసం ఏర్పాటుచేసిన రేకులు షెడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో చిన్న పాటి వర్షానికి బురదమయ మవుతోంది. ఫ దైవదర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే వారికోసం పార్కింగ్‌ సదుపాయం లేదు.

భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు..

గతంలో టీడీపీ పాలనలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని సంగాం ఆలయ కమిటీ చైర్మన్‌ బోను ఆనందరావు తెలిపారు. తర్వాత వైసీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ప్రస్తుతం రహదారి సమస్యకు పరిష్కారం చూపామని తెలిపారు. త్రివేణి సంగమ ప్రాంతంలో స్నానఘాట్‌, బట్టలు మార్చుకునేందుకు గదులు నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు. దేవదాయశాఖ అధికారులతో చర్చించి పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా తాను ఇటీవలే వచ్చానని, ఆలయా ఆస్తులు పరిశీలించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఈవో శ్యామలరావు తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 12:11 AM