ప్రతి ఫిర్యాదూ పరిష్కారం కావాలి
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:05 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరిం చాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరిం చాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో ఆయన అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో జి.కేశవనాయుడులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 105 మంది అర్జీదా రులు తమ వినతులను కలెక్టర్, ఇతర అధికారులకు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
శంకరన్ అందరికీ ఆదర్శం
పీపుల్స్ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్.ఆర్.శంకరన్ చూపిన మార్గం అందరికీ ఆదర్శమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్.ఆర్.శంకరన్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో జి.కేశవనాయుడు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పింఛన్ మంజూరు చేయండి
తాను పూర్తిగా ఏమీ పనిచేయలేని పరిస్థితిలో ఉన్నా నని, తనకు రూ.10వేలు పింఛన్ మంజూరు చేయాలని సీతానగరం మండలానికి చెందిన రామ్మోహన్‌రావు అనే దివ్యాంగుడు కోరాడు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు తన పరిస్థితిని వివరించాడు.
వీధిన పడ్డాం.. న్యాయం చేయండి
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తాము ఉపాధి కోల్పోయామని, తమకు న్యాయం చేసి విధుల్లోకి తీసుకోవాలని గిరిజన ఇంజినీరింగ్ శాఖలో పనిచేస్తూ విధుల నుంచి తొలగించబడిన టెక్నికల్ అసిస్టెంట్లు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్‌కు మొరపెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖరాసి తగు చర్యలు తీసుకుంటానని పీవో హామీనిచ్చారు.