ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో చేరేందుకు గడువు పెంపు
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:03 AM
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఈనెల 15వ తేదీలోగా చేరవచ్చని మండల సార్వత్రిక విద్యా పీఠం సమన్వయకర్త పెదిరెడ్డి శ్రీనువాసరావునాయుడు, పక్కి సదాశివరావులు తెలిపారు.
గరుగుబిల్లి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఈనెల 15వ తేదీలోగా చేరవచ్చని మండల సార్వత్రిక విద్యా పీఠం సమన్వయకర్త పెదిరెడ్డి శ్రీనువాసరావునాయుడు, పక్కి సదాశివరావులు తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీసాయి నికేతన్ హైస్కూల్‌లో గురువారం వీరు విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్‌లో చేరేందుకు ఈనెల 25వ తేదీలోగా అపరాద రుసుం రూ.200 ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని చెప్పారు. ఈనెల 25వ తేదీలోగా అపరాధ రుసుంతో చేరేందుకు అవకాశం కల్పించారని తెలిపారు.