రైతులు సహకరించాలి: ఆర్డీవో
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:31 AM
రైతులు అభివృద్ధికి సహకరించాలని ఆర్డీవో ఎం.వి. సూర్యకళ కోరారు.
భోగాపురం: రైతులు అభివృద్ధికి సహకరించాలని ఆర్డీవో ఎం.వి. సూర్యకళ కోరారు. బుధవారం ఆమె నందిగాం గ్రామంలో పర్యటించి భూసేకరణపై రైతులతో మాట్లాడారు. విమానాశ్రయ ఏర్పాటులో భాగంగా మాలనందిగాం సమీప చంపావతి నదిలో బావులు నిర్మించి... అక్కడి నుంచి విమానాశ్రయానికి నీరు పరఫరా చేయడానికి పైపులైన్ల పనులు చేపడుతున్నారు. దీని కోసం నందిగాం పరిధిలో సుమారు 38 సెంట్ల స్థలం అవసరం. అందులో సుమారు 14 మంది రైతులకు సంబంధించి 33 సెంట్ల స్థలం జిరాయితీ భూమి ఉంది. దీని సేకరణ నిమిత్తం నోటిపికేషన్ విడుదల చేశారు. ఆమేరకు భూసేకరణ ప్రారంభించారు. దీనికి సంబందించి ఆర్డీవో సూర్యకళ స్థానిక రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అనువైన ధర ఇస్తుందని, రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.సురేష్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.