Share News

కుదమలో గజరాజులు

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:47 PM

జియ్యమ్మవలస మండలంలో కుదమ పంచాయతీలో గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి.

 కుదమలో గజరాజులు
కుదమ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

జియ్యమ్మవలస, జూలై 23 : జియ్యమ్మవలస మండలంలో కుదమ పంచాయతీలో గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడే సంచరిస్తున్న ఏనుగులు రెండు ఎకరాల్లో మొక్కజొన్న , మరో మూడు ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు పెంచిన నారుమళ్లతో పాటు చెరకు పంటను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకముందే.. అటవీశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. ఏనుగుల తరలింపు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 11:47 PM