Share News

Good News 108 సిబ్బందికి తీపికబురు

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:52 PM

Good News for 108 Staff 108 వాహన సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతన పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెలకు రూ.4 వేలు అదనంగా ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు శనివారం వైద్యశాఖ సమీక్షలో చెప్పారు.

Good News 108  సిబ్బందికి తీపికబురు
108 వాహనం

అదనంగా రూ.4వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం

సాలూరు రూరల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 108 వాహన సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతన పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెలకు రూ.4 వేలు అదనంగా ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు శనివారం వైద్యశాఖ సమీక్షలో చెప్పారు. దీంతో జిల్లాలో 108 వాహన సిబ్బంది , జిల్లా మేనేజర్‌ మన్మథరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా టీడీపీ ప్రభుత్వం 2014లో జీవో 49 ప్రకారం 108 సిబ్బందికి అదనంగా ఇస్తున్న మొత్తాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దానికి బదులుగా కొంతమేరే వేతనాలను పెంచింది. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 108 సిబ్బంది సేవలను గుర్తించింది. జిల్లాలో 108 వాహనాలు 17 వరకూ ఉన్నాయి. వీటిలో 86 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పైలెట్లు, ఈఎంటీలు ఉన్నారు. సీనియర్‌ టెక్నీషియన్లకు రూ.30 వేలు, పైలెట్లకు రూ.28 వేలు, జూనియర్‌ టెక్నీషియన్లకు రూ.20 వేలు, పైలెట్లకు రూ.18 వేలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయంతో వారికి అదనంగా రూ.4వేలు అందనుంది.

Updated Date - Dec 28 , 2024 | 11:52 PM