మద్యం షాపు వేలం రేసులో బామ్మ
ABN , Publish Date - Oct 07 , 2024 | 11:22 PM
ఈ నెల 11 నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మద్యం షాపుల వేలంలో పాల్గొనేందుకు అవసరమైన దరఖాస్తు అందజేయడానికి సుమారు 85 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
మద్యం షాపు వేలం రేసులో బామ్మ
మద్యం షాపుకోసం దరఖాస్తు చేసేందుకు వచ్చిన వృద్ధురాలు
బొబ్బిలి, అక్టోబరు7: ఈ నెల 11 నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మద్యం షాపుల వేలంలో పాల్గొనేందుకు అవసరమైన దరఖాస్తు అందజేయడానికి సుమారు 85 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. దత్తిరాజేరు మండలం పప్పల లింగాలవలస గ్రామానికి చెందిన పప్పల అచ్చయ్యమ్మ బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి సోమవారం వచ్చింది. ఏమి వచ్చావమ్మా? అని అడిగితే వైన్ షాపు పెట్టడానికి అని నవ్వుకుంటూ బదులిచ్చింది. బాడంగి మండలంలో మద్యం షాపుకోసం జరిగే వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేయడానికి వచ్చానని చెప్పింది. దరఖాస్తు ప్రక్రియను ఆమె కుటుంబ సభ్యులు చూస్తుండడంతో ఆమె బెంచీపై కూర్చొని ఉండగా అందరూ ఆసక్తిగా పలకరించారు.