Share News

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:01 AM

జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నింటాయి. చర్చిల్లో సందడి వాతావరణం కనిపించింది. చిన్నారులు, యువత కేరింతలు కొట్టారు. మంగళవారం నుంచి చర్చిలు విద్యుత్‌ కాంతులతో మిరుమిట్లు గొలిపాయి.

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్‌

విజయనగరం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నింటాయి. చర్చిల్లో సందడి వాతావరణం కనిపించింది. చిన్నారులు, యువత కేరింతలు కొట్టారు. మంగళవారం నుంచి చర్చిలు విద్యుత్‌ కాంతులతో మిరుమిట్లు గొలిపాయి. బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో ఆశీస్సులు అందజేశారు. శాంతాక్లాజ్‌ వేషధారులు అందరినీ ఆకట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని స్వీమ్స్‌ బాప్టిస్ట్‌ మెమోరియల్‌ చర్చి, ఆర్‌సీఎం, సెయింట్‌ లూథరన్‌ చర్చిలలో క్రైస్తవులు అధిక సంఖ్యలో ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

-------------

Updated Date - Dec 26 , 2024 | 12:01 AM