మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలి
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:50 PM
ఆహార పదార్థాలను రుచి చూసి ప్రతి రోజూ మెనూ ప్రకారం రుచికరంగా భోజనాలు పెట్టకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంఈవో-1 సామల సింహాచలం హెచ్చరించారు.
సీతానగరం (బలిజిపేట) : ఆహార పదార్థాలను రుచి చూసి ప్రతి రోజూ మెనూ ప్రకారం రుచికరంగా భోజనాలు పెట్టకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంఈవో-1 సామల సింహాచలం హెచ్చరించారు. బలిజిపేట మండలంలోని వంతరాం కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం పీఎం పోషణ భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. భోజనం బాగోడంలేదని బాలికలు ఫిర్యాదు చేయడంతో భోజనశాలను తనిఖీచేశారు. నాణ్యమైన విద్యా బోధన అందిం చాలని కోరారు. విద్యార్ధినులకు సరిపడే వసతి, భవనాల కొరత ఉందని గుర్తిం చామని, ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఎంఈవో తెలిపారు.కార్యక్రమంలో రెవెన్యూ సహాయకులు తిరుమలరావు, ఎస్‌వో మధు రవాణి, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.