Share News

భారీ వాహనం ఢీకొని.. నేలకూలి..

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:25 AM

ఇది భామినిలోని అలికాం-బత్తిలి రోడ్డు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం ఎందుకిలా పడి ఉందనుకుంటున్నారా? సోమవారం ఓ భారీ వాహనం ఢీ కొనడంతో ఇలా నేలకూలింది.

 భారీ వాహనం ఢీకొని.. నేలకూలి..
వాహనం ఢీకొనడంతో నేలకొరిగిన అంబేడ్కర్‌ విగ్రహం

ఇది భామినిలోని అలికాం-బత్తిలి రోడ్డు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం ఎందుకిలా పడి ఉందనుకుంటున్నారా? సోమవారం ఓ భారీ వాహనం ఢీ కొనడంతో ఇలా నేలకూలింది. ఇంతలో అంబేడ్కర్‌ యువజన యువ సంఘం సభ్యులు అక్కడకు చేరుకుని విషయం తెలుసుకున్నారు. వెంటనే వాహన డ్రైవర్‌తో మాట్లాడారు. నూతన విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మరమ్మతులు చేయిస్తానని వాహనదారులు చెప్పినా వారు వినలేదు. నూతన విగ్రహం ఏర్పాటా.. లేక మరమ్మతులు చేయాలా ? అనే దానిపై ఇరవురి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మార్గంలో తరచూ ఏదో ఒక వాహనం అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఢీకొనడం పరిపాటిగా మారింది. విశాఖ నుంచి ఒడిశా వైపు భారీ వాహనాలు వెళ్లడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- భామిని

Updated Date - Feb 13 , 2024 | 12:25 AM