ఆస్పత్రి భవనాలను పూర్తిచేయాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:34 AM
నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను త్వరిత గతిన పూర్తి చేయాలని సీపీఎం నాయకులు ఎం.శ్రీనివాస్, కె.ఈశ్వరరావు డిమాండ్ చేశారు.
సాలూరు: నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను త్వరిత గతిన పూర్తి చేయాలని సీపీఎం నాయకులు ఎం.శ్రీనివాస్, కె.ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్ర మం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మామిడిపల్లి, తోణాం గ్రామాల్లో నిర్మాణదశలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలను త్వరితగతి న పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని పరీక్షలు అందుబాటులోకి తేవాలని కోరారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకు రాలు సూర్యకుమారికి వినతిపత్రం అందజేశారు.