113 మలేరియా హైరిస్క్ గ్రామాల గుర్తింపు
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:37 PM
:జిల్లాలో 113 మలేరియా హైరిస్క్ గ్రామాలను అధికారులు గురించారు. జిల్లాలో మలేరియా నివారణకు చర్యలు చేపట్టారు. ఇటీవల జడ్పీ సమావేశంలో వ్యాధులపై సభ్యులు నిలదీయడంతో నివారణ చర్యలు చేపట్టా లని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి):జిల్లాలో 113 మలేరియా హైరిస్క్ గ్రామాలను అధికారులు గురించారు. జిల్లాలో మలేరియా నివారణకు చర్యలు చేపట్టారు. ఇటీవల జడ్పీ సమావేశంలో వ్యాధులపై సభ్యులు నిలదీయడంతో నివారణ చర్యలు చేపట్టా లని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.ఫైలేరియాకు సంబందించి 68 గ్రామాలను గుర్తించారు. వీటిలో ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. రామభధ్రాపురం మండ లంలోని అరికతోట ిపీహెచ్‌సీ పరిధిలోని కొన్నిగ్రామాలు, మెంటాడ, చల్లపేట, ఎస్.కోట నియోజవర్గంలోని కొట్టాంలో ఏటా ఎక్కువమంది మలేరియా బారిన పడు తున్నట్లు వైద్య, ఆరోగ్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పారిశుధ్యలోపం తదితర కారణాలతో ఎక్కువ సంఖ్యలో మలేరియా, ఫైలేరియా వ్యాధుల బారినపడుతు న్నారు.ఈనేపథ్యంలో దోమల నివారణకు కావల్సిన గంబూషీయా చేపలకోసం రూ.32 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు చేప్పారు. కాగా జులై, ఆగస్టులో ఎక్కువ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో సచివాలయ సిబ్బందికి గ్రామాల్లో కాలువలు, గుంతలు, కళ్లాలు, నీరు నిల్వలు ఉన్నచోట దోమల నివారణ మందును పిచికారీ చేయాలని కోరినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు.