Share News

బేకరీలో అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:10 AM

bakery: రాజాంలోని పాలకొండ రోడ్డులో గల రవి బేకరీపై శనివారం సాయంత్రం విజిలెన్స్‌, ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ, రెవెన్యూ, కార్మికశాఖల అధికారులు దాడులు నిర్వహించారు. బేకరీలో స్వీట్లు, బేకరీ ఆహార వస్తువులతోపాటు ఇతర తినుబండారాలను తనిఖీచేశారు. ఆహార పదార్థాల రుచి, వాసన పరిశీలిం పదార్థాలు నిల్వ ఉంచ డంపై అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు.

బేకరీలో అధికారుల తనిఖీలు
బేకరీలో తినుబండారాలను పరిశీలిస్తున్న అధికారులు

రాజాం రూరల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజాంలోని పాలకొండ రోడ్డులో గల రవి బేకరీపై శనివారం సాయంత్రం విజిలెన్స్‌, ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ, రెవెన్యూ, కార్మికశాఖల అధికారులు దాడులు నిర్వహించారు. బేకరీలో స్వీట్లు, బేకరీ ఆహార వస్తువులతోపాటు ఇతర తినుబండారాలను తనిఖీచేశారు. ఆహార పదార్థాల రుచి, వాసన పరిశీలిం పదార్థాలు నిల్వ ఉంచ డంపై అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అధికారులు తనిఖీలు నిర్వహి స్తున్న సమయంలో పలువురు వినియోగదారులు ఆహార పదార్థాల నాణ్యతపై బేకరీ యజమాని రవితో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న ఏడు వంట గ్యాస్‌ సిలిండర్లు, పలు తూనిక యంత్రాలను ఆయాశాఖల అధికారులు సీజ్‌ చేశారు. పలురకాల తినుబండారాల శ్యాంపిళ్లను తదుపరి పరీక్షల కోసం అధి కారులు తీసుకువెళ్లారు. శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా అమలు అధికారి బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్‌ సీఐ సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ బి.రామా రావు, ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారి పి.వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అఽధికారి ఎ.బలరామకృష్ణ, కార్మికశాఖ అధికారి కొండలరావు, ఆర్‌ఐ విద్యాసాగర్‌ తదితరులు తనిఖీలు చేశారు.

Updated Date - Dec 29 , 2024 | 12:10 AM