పీజీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Aug 07 , 2024 | 12:05 AM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డా.పీవీ కృష్ణాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
చీపురుపల్లి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డా.పీవీ కృష్ణాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 7 నుంచి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. చీపురుపల్లి ప్రభుత్వ కళాశాలలో (కోడ్ ఏయూజీసీఎస్‌ఎఫ్) ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 40 సీట్లు, కంప్యూటర్ సైన్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏపీ పీజీసెట్-2024లో అర్హత సాధించినవారు పీజీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్ తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల పని వేళల్లో సంప్రదించవచ్చునన్నారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు..
ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదవాలనుకున్నవా రు ఈనెల 27లోగా దరఖాస్తులు అందజేయాలని సార్వత్రిక విద్యా పీఠం చీపురుపల్లి సహాయ కోఆర్డినేటన్ గదుల సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 27వ తేదీ లోగా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. రూ.200 అపరాధ రుసుంతో సెప్టెంబరు 4వ తేదీ వరకూ దరఖాస్తులు పంపించ వచ్చన్నారు. ఇతర వివరాల కోసం 9396293992 నెంబరుకు సంప్రదించాలని సూచించారు.