pond చెరువు కాదండోయ్..
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:15 AM
It's Not a pond గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అలికాం-బత్తిలి రోడ్డుపై గుంతల్లో నీరు చేరింది. దీంతో ఆ మార్గం చెరువును తలపిస్తోంది.
భామిని, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అలికాం-బత్తిలి రోడ్డుపై గుంతల్లో నీరు చేరింది. దీంతో ఆ మార్గం చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఇటీవల ఈ దారిలో చిన్న చిన్న గుంతలను పూడ్చి తూతూ మంత్రంగా పనులు చేపట్టారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న జోరు వర్షాలకు మళ్లీ యథా స్థితి నెలకొంది. దీంతో కొరమ, ఘనసర, పసుకుడి, బిల్లుమడ రహదారిలో ప్రయాణమంటేనే వాహనదారులు భయపడుతున్నారు. గుంత ఎక్కడుందో.. రోడ్డు ఎక్కుడుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.