Share News

electricity charges: విద్యుత్‌ చార్జీల పెంపుపై జగన్‌ డ్రామాలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:45 PM

electricity charges: విద్యుత్‌ చార్జీల పెంపునకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఏమీ ఎరగనట్లు డ్రామాలాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు విమర్శించారు. ఆదివారం చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్‌ చార్జీల పెంచడానికి జగనే కారణమన్నారు.

electricity charges: విద్యుత్‌ చార్జీల పెంపుపై జగన్‌ డ్రామాలు
మాట్లాడుతున్న రామ్‌మల్లిక్‌నాయుడు:

ఫ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు

చీపురుపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల పెంపునకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఏమీ ఎరగనట్లు డ్రామాలాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు విమర్శించారు. ఆదివారం చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్‌ చార్జీల పెంచడానికి జగనే కారణమన్నారు. లక్షల కోట్లు అక్రమార్జన కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెట్టిన జగన్‌ ప్రజల సంక్షేమం పేరుతో రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమ లుకోసం చంద్రబాబునాయుడు అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. కాగా గుర్ల మండలం లోని గోషాడకు చెందిన బాగురోతు సత్యంనాయుడుకు రూ.1,21,198, చీపురుపల్లి మండలంలోని అలజంగికి చెందిన మీసాల సూరప్పడుకు రూ.51,531లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను రామ్‌మల్లిక్‌నాయుడు పంపిణీచేశారు. కార్య క్రమంలో జనసేన ఇన్‌చార్జి విసినిగిరి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు రౌతు కామునా యుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, మహంతి అప్పలనాయుడు, శనపతి శ్రీనివాసరావు, ఇజరోతు రాంబాబు, దన్నాన సూరపునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:45 PM