తోటపల్లి ప్రాజెక్టులో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 10 , 2024 | 12:32 AM
ప్రాజెక్టులో పడి వ్యక్తి మృ తి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గరుగుబిల్లి ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గరుగుబిల్లి, జూలై 9: తోటపల్లి ప్రాజెక్టులో పడి వ్యక్తి మృ తి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గరుగుబిల్లి ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లికి చెందిన గొట్టిపల్లి గో విందరావు(55)కు మతిస్థిమితం లేకపోవడంతో పాటు అనా రోగ్యం కారణాలతో బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి తోటపల్లి ఐటీడీఏ పార్కు, బో టు షికారు ప్రాంతంలోకి వెళ్లి అక్కడ నదిలో దూకాడు. నదిలో దూకిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా మృతునికి భార్య సత్యవతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిరు పేద కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికు లు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.