గిరిజన రైతులకు మారిషస్ పైనాపిల్ మొక్కలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:25 PM
సీతంపేట, భామిని మండలాల్లో ప్రయోగాత్మకంగా గిరిజన రైతులకు మారిషస్ పైనాపిల్ మొక్కలను పంపిణీ చేయనున్నట్టు ఐటీడీఏ పీవో వి.వి.రమణ శనివారం ఒక ప్రటకటనలో తెలిపారు.
సీతంపేట: సీతంపేట, భామిని మండలాల్లో ప్రయోగాత్మకంగా గిరిజన రైతులకు మారిషస్ పైనాపిల్ మొక్కలను పంపిణీ చేయనున్నట్టు ఐటీడీఏ పీవో వి.వి.రమణ శనివారం ఒక ప్రటకటనలో తెలిపారు. రెండు మండలాల్లో 110 ఎకరాల విస్తీర్ణంలో పెంపకానికి గాను 90 శాతం రాయితీపై వాటిని అందించ నున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీఏ టీఎస్‌స్ పథకం కింద ఎంపికైన రైతుకు ఎకరాకు 8 వేలు చొప్పున పైనాపిల్ మొక్కలు, ఎరువులు, చేతిపంపులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్, రైతు ఫొటోతో దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.