రక్తహీనత నివారణకు చర్యలు
ABN , Publish Date - Aug 31 , 2024 | 12:12 AM
సీతంపేట ఏజెన్సీలో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
సీతంపేట రూరల్, ఆగస్టు 30: సీతంపేట ఏజెన్సీలో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన సీతంపేటలో పర్యటించారు. తొలుత వైటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన గర్భిణుల వసతిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీమంతాలు నిర్వహించి పౌష్టికాహార కిట్లను అందించారు. వసతిగృహంలో గర్భిణులకు పౌష్టికాహారం అందిం చాలని, వారి ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించా రు. డోలీ మోతలు, మాతా శిశు మరణాలను నివారించాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాకు సీఎస్‌ఆర్ ద్వారా మూడు అంబులెన్స్‌లు వస్తాయని, వాటిలో ఒకటి సీతంపేటకు కేటాయిస్తామని చెప్పారు. మహాప్రస్థానం వాహనాన్ని కూడా కేటాయించ నున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ ఇన్ చార్జి పీవో వీవీ రమణ, ఏపీవో చినబాబు, ఎంపీపీ ఆదినారాయణ, డీడీ అన్నదొర, టీడబ్ల్యూ ఈఈ సింహాచలం, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో విజయపార్వతి ఉన్నారు.
డీడీ కార్యాలయం ఇక్కడే ఉంచండి..
సీతంపేట ఐటీడీఏలోనే డీడీ కార్యాలయం ఉంచాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు కలెక్టర్, ఎమ్మెల్యేను కోరారు. ఇక్కడ నుంచి డీడీ కార్యాలయం తరలిస్తే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు రామ్మోహనరావు, పురుషోత్తం, విశ్వనాథం, చిరంజీవి, నరేష్, చందు, వెంకీ ,అప్పారావు, రామస్వామి తదితరులు వినతిపత్రం అందించారు.
నైపుణ్యం పెంపొందించండి
సీతంపేట: ఆదివాసీలకు డిజైన్ రంగాలపై నైపుణ్యం పెంపొందించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సీతంపేటలో లేపాక్షీ హ్యాండీ క్రాప్ట్స్ (ఆంధ్రప్రదేశ్ హస్త కళ అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివాసీ డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్ షాప్, సవర ఆదివాసీ పెయింటింగ్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. డిజైనర్స్ ధర్మ, తేజస్వి, కిషోర్, కన్వీనర్ అనీల్‌కుమార్, ఆర్ట్ టీచర్ గౌరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
బెలగాం:ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక పాతబస్తాండ్ వద్ద సెయింట్ పీటర్స్ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ చైతన్య ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్. దామోదర్ ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపరాదన్నారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన 5కె రెడ్ రన్‌లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ప్రథ మ స్థానంలో నిలిచిన వారికి రూ.7 వేలు, ద్వితీయ స్థానం పొందిన వారికి రూ.4 వేలు చొప్పున అందజేశారు.3న రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు వారిని పంపనున్నట్లు ఎయిడ్స్ నియంత్రణ అఽధికారి ఎం.వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆర్‌బీఎస్‌కె జిల్లా సమన్వయ అధికారి డా.రఘు కుమార్ పాల్గొన్నారు.