Share News

మెనూ చార్జీలు పెంచాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:28 AM

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ కార్యదర్శి బలసా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

మెనూ చార్జీలు పెంచాలి

రామభద్రపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ కార్యదర్శి బలసా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మెనూ చార్జీలు పెంచాలని, కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని, ప్రమాద బీమా చెల్లించాలని, ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అందించాల ని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈవో తిరుమల ప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చిన్నమ్మలు, తెంటు సరోజిని, లక్ష్మి, ఈశ్వరరావు, తవుడమ్మ, నాగమణి పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:28 AM