Share News

ఓటరుకు వల

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:21 AM

ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో అధికార పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ మార్గాల్లో ఓటర్ల వద్దకు వెళ్తూ ప్రలోభాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హోం ఓటింగ్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా ఓటరు జాబితాలు పట్టుకుని వెళ్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు.

ఓటరుకు వల

ఓటరుకు వల

హోం ఓటింగ్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ వర్గాలపై అధికార పార్టీ కన్ను

జాబితాలు పట్టుకుని ఇంటింటికీ నాయకులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో అధికార పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ మార్గాల్లో ఓటర్ల వద్దకు వెళ్తూ ప్రలోభాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హోం ఓటింగ్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా ఓటరు జాబితాలు పట్టుకుని వెళ్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఈ సారి ఎన్నికల సంఘం విభిన్నప్రతిభావంతులు, 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఇళ్ల నుంచే ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో వీరి జాబితాను కార్యాలయాల నుంచి తెప్పించుకుని వారి ఓట్లపై నాయకులు వల విసురుతున్నారు. ఇప్పటి నుంచి వారు చేజారిపోకుండా మభ్య పెడుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లోని గృహ సారధులు పింఛను లబ్ధిదార్ల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తేనే సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని ప్రచారం చేస్తున్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి వారిని వెంట తీసుకెళ్తున్నారు. కాగా ఉద్యోగులపై కూడా వైసీపీ నాయకులు ఓ కన్నేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే తేదీలను వారి వద్దకు వెళ్లి గుర్తు చేస్తున్నారు. పోలింగ్‌ విధుల్లో ఉండే పీఓలు, ఏపీవోలు, ఓపిఓలు కలిపి 14,400 మంది ఉన్నారు. వీరే కాకుండా పోలీస్‌, రెవెన్యూ, రూట్‌ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. మొత్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది 30వేల వరకు ఉంటారు. వారంతా మే 7, 8, 9 తేదీల్లో ఆయా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్‌సెంటర్ల వద్దకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని కవర్లో పెట్టి సీల్‌చేసి అక్కడే ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ బాక్సులో వేయాలి. అయితే ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీ సీపీఎస్‌ రద్దు అమలు కాని కారణంగా గుర్రుగా ఉన్నారు.

----------------------------------------------------------------------

నియోజకవర్గం హోమ్‌ ఓటింగ్‌ విభిన్నప్రతిభావంతులు

----------------------------------------------------------------------

విజయనగరం 20 1917

ఎస్‌.కోట 123 3570

నెల్లిమర్ల 148 2483

గజపతినగరం 41 4802

చీపురుపల్లి 454 2677

బొబ్బిలి 146 3234

రాజాం 219 3311

------------------------------------------------------------------------

మొత్తం 1156 21,999

------------------------------------------------------------------------

Updated Date - Apr 15 , 2024 | 12:21 AM