Share News

రేపటి నుంచి వన్డే టోర్నీ

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:08 AM

ఈ నెల 21 నుంచి జిల్లా వేదికగా ప్రతిష్టాత్మకమైన దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ ప్రారంభం కానుంది. సర్‌ విజ్జీ క్రికెట్‌ మైదానంతో పాటు, డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్‌ పీవీజీ రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ (నార్త్‌ జోన్‌ ఏసీఏ అకాడమీ) క్రికెట్‌ మైదానాల్లో జరిగే టోర్నీలో 8 రాష్ట్ర స్థాయి జట్లు పాల్గొంటాయి.

రేపటి నుంచి వన్డే టోర్నీ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వీడీసీఏ ప్రతినిధులు

రేపటి నుంచి వన్డే టోర్నీ

డాక్టర్‌ పీవీజీ రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, విజ్జీ మైదానాల్లో 14 మ్యాచ్‌లు

పాల్గోనున్న 8 రాష్ట్ర జట్లు

విజయనగరం టౌన్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈ నెల 21 నుంచి జిల్లా వేదికగా ప్రతిష్టాత్మకమైన దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ ప్రారంభం కానుంది. సర్‌ విజ్జీ క్రికెట్‌ మైదానంతో పాటు, డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్‌ పీవీజీ రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ (నార్త్‌ జోన్‌ ఏసీఏ అకాడమీ) క్రికెట్‌ మైదానాల్లో జరిగే టోర్నీలో 8 రాష్ట్ర స్థాయి జట్లు పాల్గొంటాయి. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ వివరాలను విజయనగరం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధి పి.సీతారామరాజు గురువారం విలేకరులకు తెలిపారు. విజయహజారే వన్డే టోర్నీలో భాగంగా గ్రూప్‌ డి మ్యాచ్‌లు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహిస్తామని తెలిపారు. 21న విజ్జీ స్టేడియంలో చండీగఢ్‌ - తమిళనాడు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుండగా 23న జమ్ముకాశ్మీర్‌ - విదర్భ జట్ల మధ్య, 26న జమ్ము కాశ్మీర్‌ - తమిళనాడు, 28న చత్తీస్‌గడ్‌ - ఉత్తరప్రదేశ్‌, 31న జమ్ము కాశ్మీర్‌ - మిజోరం, వచ్చే నెల 1న ఉత్తరప్రదేశ్‌ - విదర్భ, 5న చత్తీస్‌గఢ్‌ - తమిళనాడు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. అలాగే ఏసీఏ అకాడమీ మైదానంలో 21న జమ్ముకాశ్మీర్‌ - ఉత్తరప్రదేశ్‌, 23న చండీగఢ్‌ - చత్తీస్‌గడ్‌, 26న చత్తీస్‌గడ్‌ - విదర్భ, 28న జమ్ము కాశ్మీర్‌ - తమిళనాడు, 31న చండీగఢ్‌ - ఉత్తరప్రదేశ్‌, 3న తమిళనాడు - మిజోరం, 5న మిజోరం - విదర్భ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు వర్మ, సర్పరాజ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:08 AM