Share News

చెరువులో పడి వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:23 AM

ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.

చెరువులో పడి వృద్ధురాలి మృతి

బొండపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఎం.కొత్తవలస గ్రామంలో కంది అప్పలనర్సమ్మ(75) నివసిస్తోంది. ఆదివారం తెల్లవారు జామున అప్పలనర్సమ్మ కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపాన ఉన్న చెరువు గట్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమా దవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందింది. ఎంతకీ ఇంటికి రాకపోవ డంతో మనవడు కడగల శ్రీనివాసరావు గ్రామ పరిసరాల్లో వెతకగా చెరువులో అప్పల నరసమ్మ విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మనవడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Sep 02 , 2024 | 12:24 AM