Share News

బాబా స్ఫూర్తితో ముందుకు సాగాలి

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:10 AM

భక్తి మార్గమే ప్రతి ఒక్కరి జీవన మార్గం కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం కంచరవీధి బాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.

బాబా స్ఫూర్తితో ముందుకు సాగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురంటౌన్‌, నవంబరు23 (ఆంధ్రజ్యోతి) : భక్తి మార్గమే ప్రతి ఒక్కరి జీవన మార్గం కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం కంచరవీధి బాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మానవ సేవే మాధవ సేవ అన్న సత్యసాయి సూక్తిని అందరూ ఆచరించాల్సిన అవసరముందన్నారు. బాబా స్ఫూర్తితో ముందుకు నడవాలని, సుందర పార్వతీపురంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.

27న బాల వివాహ ముక్త్‌ భారత్‌కు శ్రీకారం

పార్వతీపురం, నవంబరు23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈనెల 27న ‘బాల వివాహ ముక్త్‌ భారత్‌’ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. బాల్య వాహాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్‌ఎం, ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్‌లు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములవ్వాలని కోరారు. జిల్లా, డివిజనల్‌, మండల, గ్రామ స్థాయిల్లో బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమించనున్నామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు నోడల్‌ అధికారులుగా ఉంటారని తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 12:10 AM