Share News

పీడీఎస్‌ బియ్యం సీజ్‌

ABN , Publish Date - Aug 10 , 2024 | 12:26 AM

మండలంలోని మెట్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన 690 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.

 పీడీఎస్‌ బియ్యం సీజ్‌

చీపురుపల్లి: మండలంలోని మెట్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన 690 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. శుక్రవారం తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేపట్టారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని గుర్తించి, సీజ్‌ చేశారు. ఈ మేరకు సత్యవరపు ఈశ్వరరావు, సత్యవరపు భాస్కరరావులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ అధికారులతో బాటు సీఎస్‌డీటీ పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 12:26 AM