Share News

Pedda Polamamba చదురుగుడికి పెదపోలమాంబ

ABN , Publish Date - Dec 30 , 2024 | 10:45 PM

Pedda Polamamba at Chaduru Gudi ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరలో తొలి ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఏటాలానే ఈ సారి కూడా జన్నివారి ఇంటి నుంచి ఎస్‌.పెద్దవలస రహదారి వద్ద ఉన్న గద్దె వద్దకు పెదపోలమాంబను తీసుకొచ్చారు.

Pedda Polamamba  చదురుగుడికి పెదపోలమాంబ
పెదపోలమాబను గ్రామంలోకి తీసుకొస్తున్న దృశ్యం

  • అమ్మవారికి ప్రత్యేక పూజలు.. మొక్కుబడులు చెల్లింపు

మక్కువ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరలో తొలి ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఏటాలానే ఈ సారి కూడా జన్నివారి ఇంటి నుంచి ఎస్‌.పెద్దవలస రహదారి వద్ద ఉన్న గద్దె వద్దకు పెదపోలమాంబను తీసుకొచ్చారు. గ్రామపెద్దలు, కరణం కుటుంబీకులు, భక్తులు సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో మొక్కుబడులు చెల్లించారు. అనంతరం డప్పు వాయిద్యాలు, యువత కేరింతలు, భక్తుల కోలాహాలం నడుమ పెదపోలమాంబను చదురుగుడికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా జనవరి 6న పెదపోలమాంబకు తొలేళ్లు ఉత్సవం, 7న ప్రధాన ఉత్సవం, 8న అనుపోత్సవం నిర్వహిస్తారు. అదే రోజున చినపోలమాంబను గ్రామంలోకి తీసుకొచ్చేందుకు సనప చాటింపు నిర్వహిస్తారు. జనవరి 13న శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకొస్తారు. 13 రోజుల పాటు పోలమంబ చదురుగుడిలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 27న తోలెళ్ల ఉత్సవం, 28న సిరిమాను ఉత్సవం, 29న అనుపోత్సవం నిర్వహిస్తారు.

Updated Date - Dec 30 , 2024 | 10:45 PM