LRS: ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రజలకు మేలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:02 AM
LRS: లే అవుట్ క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) మేళాతో ప్రజలకు మేలు జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాల యంలో ఎల్‌ఆర్‌ఎస్ మేళాతో పాటు ఓపెన్ ఫోరం నిర్వహించారు.
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 28( ఆంధ్రజ్యోతి): లే అవుట్ క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) మేళాతో ప్రజలకు మేలు జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాల యంలో ఎల్‌ఆర్‌ఎస్ మేళాతో పాటు ఓపెన్ ఫోరం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కమిషనర్ నల్లనయ్య ఎల్‌ఆర్‌ఎస్ ప త్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రణాళికాధికారులు, సిబ్బంది, లైసెన్స్‌డ్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఒకే చోట ఏర్పాటై మేళాగా రూపొందించి అక్కడిక్కడే దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.