Share News

గిరిజన గ్రామాల అభివృద్ధికి ‘పీసా’

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:09 AM

గిరిజన గ్రామాల అభివృ ద్ధికే పీసా చట్టంపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.

గిరిజన గ్రామాల అభివృద్ధికి ‘పీసా’

సీతంపేట రూరల్‌: గిరిజన గ్రామాల అభివృ ద్ధికే పీసా చట్టంపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో పీసా చట్టంపై సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పీసా చట్టం గ్రామసభల్లో అందరూ పాల్గొని ఉపాధ్యక్షులు, సెక్రటరీలను ఎన్నుకోవాలని సూచించారు.

ఎన్జీవో సంస్థలను నియంత్రించాలి

గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల నిధులతో పనిచేస్తున్న ఎన్జీవో సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. సీతంపేట ఏజెన్సీలో ఎన్జీవో సంస్థ ఎవరి కోసం పనిచేస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మండలంలో 41 పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, ఏపీవో చినబాబు, ఎంపీడీవో గీతాంజలి, ఎంపీపీ బి.ఆదినారాయణ, జడ్పీటీసీ సవరలక్ష్మి, తహసీల్దార్‌ అప్పలరాజు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:09 AM