Share News

ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Sep 22 , 2024 | 12:15 AM

వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రులు కచ్చితంగా అమలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహనరావు స్పష్టం చేశారు.

ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

పార్వతీపురం టౌన్‌: వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రులు కచ్చితంగా అమలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహనరావు స్పష్టం చేశారు. శనివారం ఆయన డీపీఎంవో డా.రఘుకుమార్‌, వైద్య బృందంతో కలిసి పట్టణంలో శుభం డయాబె టిక్‌ అండ్‌ స్పెషాలిటీ కేర్‌, శ్రీసాయి సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ కేర్‌ ఆసుపత్రులను సందర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ తేదీలు, అర్హత ధ్రువపత్రాల రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రుల్లో ఉండాల్సిన వైద్య పరికరాలు, పరీక్షా కిట్లు నాణ్యత, పనితీరును తనిఖీ చేశారు. బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఉపయోగించిన సూదులు, సెలైన్‌, కాటన్‌, తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఫైర్‌ సేఫ్టీ నిర్వహణ, రోగుల టాయిలెట్లు శుభ్రత నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. వైద్య పరీక్షల ఫీజు వివరాల లిస్టును ప్రదర్శించకపోవ డంతో నిర్ణీత గడువులోగా పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆరోగ్య సూచనలు, సలహాలు తెలియజేసే పోస్టర్లు ఉండాలన్నారు. వీరితో పాటు డెమో యోగేశ్వరరావు, ఈవో సత్తిబాబు, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 12:15 AM