Share News

సమస్యలను సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:13 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఏఎస్పీ ఓ.దిలీప్‌ కిరణ్‌ ఆదేశించారు.

 సమస్యలను సత్వరం పరిష్కరించాలి
ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఏఎస్పీ దిలీప్‌ కిరణ్‌

  • పీజీఆర్‌ఎస్‌కు 4 ఫిర్యాదులు

బెలగాం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఏఎస్పీ ఓ.దిలీప్‌ కిరణ్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఏఎస్పీ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఏఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అత్తారింటి వేధింపులు, అధిక వడ్డీలు, భూ వివాదాలు, సైబర్‌క్రైం తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ హెచ్‌సీ తాతబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 27 వినతులు

సీతంపేట రూరల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయి. బెన్నరాయి, కొండాడ గ్రామంలో సీసీ రహదారి నిర్మించాలని మాజీ సర్పంచ్‌ సవర సూగన్న ఐటీడీఏ పీవో ను కోరారు. చింతమానుగూడ గ్రామంలో సామాజిక భవ నం నిర్మించాలని బిడ్డిక దుర్గారావు కోరగా, హౌసింగ్‌ బిల్లులు చెల్లించాలని అక్కన్నగూడకు చెందిన సవర పెద్ద బాపన్నలు వినతులు అందజేశారు. పవర్‌ వీడర్‌ ఇప్పించా లని మెట్టుగూడ గ్రామానికి చెందిన సవర భూగన్న కోరా రు. పీజీఆర్‌ఎస్‌లో పీవోతో పాటు ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, ఐకేపీ ఏపీడీ సన్యాసిరావు, ఏఎంవో కోటి బాబు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:13 AM