Share News

sports: సత్తాచాటిన కబడ్డీ క్రీడాకారులు

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:43 PM

sports: జిల్లాకు చెందిన బాలబాలికల కబడ్డీ జట్లు సత్తాచాటాయి. ఈ మేరకు ఈనెల 22 నుంచి 24 వరకూ తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంలో రాష్ట్రస్థాయి 50వ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి.

sports: సత్తాచాటిన కబడ్డీ క్రీడాకారులు
విజయనగరం రూరల్‌: క్రీడాకారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు:

విజయనగరం రూరల్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన బాలబాలికల కబడ్డీ జట్లు సత్తాచాటాయి. ఈ మేరకు ఈనెల 22 నుంచి 24 వరకూ తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంలో రాష్ట్రస్థాయి 50వ జూనియర్‌ బాలబాలికల కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. జిల్లా జట్లు విజయం సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాయి. దీంతో క్రీడాకారులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, బెవర భరత్‌, నాగరాజు వర్మ, కోచ్‌ కోరాడ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

క్రీడాకారులకు అభినందన

విజయనగరం టౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):విజయనగరంలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడా కారులను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆదివారం అభినందించారు. ఈనెల 14, 15 తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా నుంచి 16మంది క్రీడాకారిణులు, 34 మంది పురుషులు మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొని 144 బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.కార్యక్రమంలో కోచ్‌ శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:43 PM