రైతులకు సక్రమంగా సేవలు అందించండి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:26 AM
యు.వెంకంపేట గ్రామంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంస్థను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు.
వీరఘట్టం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): యు.వెంకంపేట గ్రామంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంస్థను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. సంస్థ పనితీరును, రైతులకు అందుతున్న సేవలను సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. రైతులకు స క్రమంగా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సరఫరా లేదని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా విద్యుత్ సరఫరాకు కావాల్సిన ఎస్టిమేషన్ వేసి, పంపించాలని వారికి సూచించా రు. భవనం చుట్టూ ఖాళీస్థలాన్ని చదును చేయాల ని, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేలా చూడాలన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడ నిల్వ ఉంచి ధర వచ్చేటప్పుడు అమ్ముకునే విధంగా దీనిని తీర్చిదిద్దాల న్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్ సత్యనా రాయణ, ఎంఆర్‌ఐ లక్ష్మణ్‌నాయుడు, ఏపీఎం కె.రాము, ఎఫ్‌పీవోసీసీవై ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు.