voter ఓటర్లగా నమోదు చేయించండి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:37 AM
Register as a voter జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఓటరుగా నమోదు చేయించాలని రిజిస్ర్టేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, జిల్లా ఎలక్ర్టోరల్ అబ్జర్వర్ ఎంవీ శేషగిరిబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లతో సమీక్షించారు.
పార్వతీపురం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఓటరుగా నమోదు చేయించాలని రిజిస్ర్టేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, జిల్లా ఎలక్ర్టోరల్ అబ్జర్వర్ ఎంవీ శేషగిరిబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే తెలియ జేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ వచ్చే ఏడాదిలో నాలుగుసార్లు జరగనుందని తెలిపారు. ఓటరు నమోదు చేసుకునే సౌలభ్యంతో పాటు తొలగింపులు, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మట్లాడుతూ... ప్రతి కళాశాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. బీఎల్‌వోల ద్వారా స్వీప్ కార్యక్రమం, ప్రత్యేక శిబిరాలను నిర్వహించామని తెలిపారు. ఓటర్లు నమోదుతో పాటు సవరణలు కూడా చేశామన్నారు. ఈ సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.