Share News

పంట నష్టంపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:15 AM

వర్షాల వల్ల పంట నష్టాన్ని అధికారులు గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు. పంటనష్టంపై తమ అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. జిల్లాలో కొద్దిరోజులుగా తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం పరిశీలించారు.

పంట నష్టంపై నివేదిక ఇవ్వండి
పూసపాటిరేగ: అల్లాడపాలెంలో వరిపంటను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు:

వర్షాల వల్ల పంట నష్టాన్ని అధికారులు గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు. పంటనష్టంపై తమ అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. జిల్లాలో కొద్దిరోజులుగా తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం పరిశీలించారు.

ఫ భోగాపురం, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): మండలంలోపి పోలిపల్లిలో పొలాల్లో ఉన్న కోసిన వరి పంట వర్షంనీటిలో ఉండడంతో మార్కెఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజ కవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు పరిశీలించారు. ప్రస్తుతం తీసుకోవలిసిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని ఏవో హరికృష్ణకు బంగార్రాజు కోరారు.

ఫపూసపాటిరేగ,డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): మండలంలో అల్లాడపాలెం పరిధిలో నీటమునిగిన వరిపంటను టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఆకిరి ప్రసాదరావు, ఏవో కె.నీలిమ పరిశీలించారు. పేరాపురం, వెంపడాం, చౌడవాడ, పూసపాటిరేగ, గోవిందపురంలో వరితోపాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాఽథమికంగా 20ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అంచనావేశారు.

ఫ నెల్లిమర్ల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):వర్షాల వల్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని శనివారం ఒక ప్రకటనలో కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉండవద్దని, తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

ఫలక్కవరపుకోట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి):మండలంలోని చందులూరు, మా ర్లాపల్లి, ఎల్‌.కోట గ్రామాల్లో తడిసిన, మొలకలు వచ్చిన పంటను ఏవో ఎం.స్వాతి ఆధ్వ ర్యంలో పరిశీలించారు. పెసర, మినుము పంటల నష్టాన్ని అంచనావేశారు.

Updated Date - Dec 22 , 2024 | 12:15 AM