నా భూములపై ప్రత్యర్థుల కన్ను
ABN , Publish Date - Jul 27 , 2024 | 11:55 PM
తన జిరాయితీ భూములను ప్రభుత్వ భూములుగా మార్చేం దుకు ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారని, ఆర్థికంగా తనను, తన కుటుంబాన్ని దెబ్బ తీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు.
చీపురుపల్లి: తన జిరాయితీ భూములను ప్రభుత్వ భూములుగా మార్చేం దుకు ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారని, ఆర్థికంగా తనను, తన కుటుంబాన్ని దెబ్బ తీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జి.సిగడాం మండలంలోని బాతువలో తనతో బాటు తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న 37,42 ఎకరాల భూమిని గయాలిగా చూపిస్తు న్నారన్నారు. అదే విధంగా విజయనగరం పట్టణంలో డీసీసీబీ జరిపిన వేలం ద్వా రా కొనుగోలు చేసిన 5200 చదరపు గజాల స్థలాన్ని తాజాగా చెరువుగా చూపి స్తున్నారని చెప్పారు. చీపురుపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాను 1970లో 1.11 ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చానని, అయితే, ఆ స్థలంలో కొంత భాగాన్ని మాత్రమే సబ్ స్టేషన్ నిర్మాణం కోసం వినియో గించారని, మిగిలిన స్థలం తనకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలుసుకుని అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. భూముల విషయంలో తనకు జరిగిన అన్యాయంపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు.