సమష్టి కృషితోనే సుందర పార్వతీపురం
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:32 AM
సమష్టి కృషితోనే సుందర పార్వతీపురం సాధ్యమని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అన్నారు.
బెలగాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితోనే సుందర పార్వతీపురం సాధ్యమని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ కళాశాలలోని సమావేశ మందిరంలో స్వచ్ఛ సుందర పార్వతీపురంపై రెండో రోజు అవ గాహన సదస్సు నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురా న్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రణాళికా బద్ధమైన వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టించవచ్చని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించాల ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చాంధ్ర సలహాదారు శ్రీనివాస్, అధికారులు డి.గోపాలకృష్ణ, రమేష్ రామన్ తదితరులు పాల్గొన్నారు.