దళితుల దీక్షకు మద్దతు
ABN , Publish Date - Jul 24 , 2024 | 12:03 AM
శివ్వాం దళితుల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహర దీక్షకు శ్రామిక మహిళా సంఘం మంగళవారం సంఘీభావం ప్రకటించింది.
పార్వతీపురం టౌన్: శివ్వాం దళితుల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహర దీక్షకు శ్రామిక మహిళా సంఘం మంగళవారం సంఘీభావం ప్రకటించింది. ఆ సంఘ నాయకులు ఇందిర, ఉమారాణి, లక్ష్మీలు మాట్లాడుతూ దళితుల భూములను లాక్కొని సాగు చేస్తున్న పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. దళితులపై దాడి చేసిన పెత్తం దారులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.