Share News

రెవెన్యూ కార్యాలయాలపై నిఘా

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:26 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

 రెవెన్యూ కార్యాలయాలపై నిఘా

- రికార్డు రూముల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు

- మదనపెల్లె ఘటన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

మెంటాడ, జూలై 26: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జిల్లాలోని కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకంగా రికార్డు రూముల వద్ద సీసీ కెమెరాలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు, తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక రికార్డులు మాయమవుతున్నాయి. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.జయలక్ష్మి మూడ్రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం వీఆర్‌ఏల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:26 PM