Share News

అనుమానాస్పద వ్యక్తులపై నిఘా: ఎస్పీ

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:01 AM

జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లల్లో అనుమానాస్పదవ్యక్తులపై ప్రత్యేక నిఘాపె ట్టాలని, వారి వెలిముద్రలను, మొబైల్‌ వేలి ముద్రల యాప్‌తో తనిఖీ చేయాలని ఎస్పీ వకూల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

  అనుమానాస్పద వ్యక్తులపై నిఘా: ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ వకూల్‌ జిందాల్‌:

విజయనగరం క్రైం: జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లల్లో అనుమానాస్పదవ్యక్తులపై ప్రత్యేక నిఘాపె ట్టాలని, వారి వెలిముద్రలను, మొబైల్‌ వేలి ముద్రల యాప్‌తో తనిఖీ చేయాలని ఎస్పీ వకూల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మాసాంతర నేరసమీక్షా సమావేశాన్ని పోలీసు అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహ ణలో ప్రతిఒక్కరూ నీట్‌ యూనిఫాం ధరించి లాఠి వెంటతీసుకుని వెళ్లాలన్నారు. రాత్రీ గస్తీని మరింత ముమ్మరం చేయాలని కోరారు. పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామసందర్శన చేయాలని తెలిపారు. దీపావళి, దసరా నేపద్యంలో అక్రమంగా బాణసంచా తయారీ, విక్రయ దారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల ముగిసిన లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులను డిస్పోజ్‌ చేసిన, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులను అభినందించి, ప్రసంశా పత్రాలు అందచేశారు. సమావేశంలో డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరా వు, వీరకుమార్‌, యూనివర్స్‌ న్యాయ సలహాదారుడు పరుశురాముతోపాటు ప సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:01 AM