Share News

నైపుణ్యాలు పెంచేందుకే సర్వే: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:37 AM

నిరుద్యోగులైన 15 నుంచి 59 సంవత్సరాల మధ్య గల స్ర్తీ, పురుషులకు, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారికి అవరసమైన నైపుణాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు.

నైపుణ్యాలు పెంచేందుకే సర్వే: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేద్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులైన 15 నుంచి 59 సంవత్సరాల మధ్య గల స్ర్తీ, పురుషులకు, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారికి అవరసమైన నైపుణాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఈ సర్వే నాణ్యంగా జరిగిలా చూడాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలం, మున్సిపాల్టీలో సచివాలయ సిబ్బందికి సర్వేకి అవసరమైన శిక్షణలు ఈ నెల 18 నుంచి 21లోగా పూర్తి చేయాలని సూచించారు. నైపుణ్యం యాప్‌లో సంపూర్ణ డేటా నమోదు చేయాలన్నారు. అన్ని విద్యా సంస్థల్లో సర్వే చేయాలని సూచించారు.

మార్చిలోగా ఎంఎస్‌ఎంఈల సర్వే

కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలన్నిటినీ వచ్చే మార్చిలోగా సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ అంబేద్కర్‌ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్‌లో పరిశ్రమల శాఖ అధికారులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే పూర్తి చేయడానికి సచివాయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు

రోడ్డు పనులు ప్రారంభం కావాలి

జిల్లాలోని రోడ్డులపై గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన పనులన్నీ ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. జిల్లాలో మంజూరైన మొత్తం 68 రోడ్డు పనులకు గాను ఇప్పటికీ 22 పనులు ప్రారంభమైనట్లు రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ కాంతి మతి వివరించారు. ఈ నెలాఖరు నాటికి 79 కిలోమీటర్ల నిడివి గల రోడ్లకు మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఈఈ జేమ్స్‌, డీఈలు పాల్గొన్నారు .

కార్యదర్శి యాప్‌తో ఇసుక

జిల్లాలో 48 ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉన్నాయని... ప్రతి రీచ్‌కు ఒక పంచాయితీ కార్యదర్శిని ఇన్‌చార్జిగా పెట్టినట్టు కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఇసుక కావలసిన వారు కార్యదర్శి యాప్‌లో రిజిస్టర్‌ చేసుకుని రసీదు పొందిన తరువాత తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు. పోలీసు లు అడ్డుకుంటే.. రసీదును చూపిస్తే వదిలేస్తారని చెప్పారు. సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. రేగిడి ఆమదాలవలస మండలం కె.వెంకటాపురం వద్ద 72 వేల మెట్రిక్‌ టన్నులకు మాన్యువల్‌గా అనుమతి లభించిందని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి, డీపీవో వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో సత్యనారాయణ; ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఉమా శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటరీకరణలో జాప్యం వద్దు

సహకార సంఘాల కంప్యూటరీకరణలో జాప్యం చేసేవారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం రాత్రి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నాటికి సభ్యుల నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Nov 16 , 2024 | 12:37 AM