పెయింటర్ అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:14 AM
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన మండ లంలో చోటు చేసుకుంది.
శృంగవరపుకోట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన మండ లంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం పెదగుడిపాలకు చెందిన మారడిబూడి గణేష్(35) ఇళ్లకు పెయింటింగ్, పుట్టిలు వేస్తాడు. గ్రామానికి చెందిన మరికొందరితో కలసి ఎస్.కోట గ్రామంలో పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం తోటివారితో కలసి నిర్మాణంలో ఉన్న భవనంపైనే నిద్రపోయాడు. సోమ వారం ఉదయానికి అనుమానస్పదంగా మృతి చెంది పడి ఉన్నాడు. భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.ఐ సీహెచ్ గంగరాజు కేసు నమోదు చేశారు.