Share News

ycp protest: అలా వచ్చారు.. ఇలా వెళ్లారు

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:15 PM

ycp protest: విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది.

ycp protest: అలా వచ్చారు.. ఇలా వెళ్లారు
విద్యుత్‌ శాఖ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న వైసీపీ నాయకులు

- ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్‌

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. జిల్లా కేంద్రం విజయనగరంలోని దాసన్నపేట విద్యుత్‌ భవన్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ శాసన సభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తప్పా పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎవరూ హాజరుకాలేదు. ఆయన కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ముందుగా స్థానిక ఎఫ్‌సీఐ గౌడౌన్‌ నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి విద్యుత్‌ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై విద్యుత్‌ భారం మోపారని అన్నారు. వెంటనే వారిపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గించడంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీని కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యుత్‌శాఖ అధికారికి కోలగట్లతో పాటు వైసీపీ నాయకులు వినతిపత్రం అందించారు. బయటకు వచ్చిన కోలగట్ల మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కార్యక్రమంలో మేయర్‌ వీవీ లక్ష్మీ, వైసీపీ నాయకులు ఆశపు వేణు, ఎస్‌వీవీ రాజేష్‌, వివిధ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:15 PM