Share News

గజరాజుల బీభత్సం

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:22 AM

మం డలంలోని సుంకి గ్రామంలో వరి చేల కుప్పలను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గజరాజుల బీభత్సం
భామినిలో వరికుప్పను చిందరవందర చేసిన ఏనుగులు

గరుగుబిల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని సుంకి గ్రామంలో వరి చేల కుప్పలను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి సంతోషపురం, సుంకి, మరుపెంట గ్రామాల్లో సంచరిస్తున్నాయి. మంగళవారం రాత్రి సుంకి గ్రామ సమీపంలోని చెరువులో ఉంటూ రాత్రి సమయంలో పంటలను ధ్వంసం చేశాయి. గ్రామంలోని గొల్లు అన్నపూర్ణ, గొల్లు చంద్రమౌళి, గులిపిల్లి కమల, తదితర రైతులకు చెందిన పంట పొలంలో వేసిన వరి కుప్పలను తిని చెల్లా చెదురు చేసి తీవ్రంగా నష్టపరిచాయి. అలాగే పంట పొలంలోని పైపులైన్లను ధ్వంసం చేసి నష్టపరిచాయి.

భామిని, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భామిని ప్రాంతంలో ఏనుగులు అలజడి సృష్టించాయి. మంగళవారం రాత్రి పోతల చంద్రబోష్‌కు చెందిన ధాన్యం కుప్పను ధ్వంసం చేశాయి. తుఫాన్‌ కారణంగా పొలంలోనే ఉంచిన వరికుప్పను గత శుక్రవారం ఏనుగులు చిందర వందర చేశాయి. మళ్లీ ఆ ప్రాంతంలో సంచరించి వరి చేను కుప్పను ధ్వంసం చేశాయి. తిండి గింజలు బురద పాలయ్యా యని రైతులు లబోదిబోమంటున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:22 AM