Share News

owning a house సొంతింటి కల కూటమిపైనే ఆశ!

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:46 AM

The dream of owning a house rests on the alliance's hope పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పేదలకు గూడు లేకుండా చేసింది. వారు చెల్లించిన డబ్బులు వాపస్‌ చేయకుండా అప్పుల ఊబిలోకి నెట్టింది. గత ఐదేళ్లూ పార్వతీపురంలో గృహ నిర్మాణాలను పూర్తి చేయించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు తీరని వేదనను మిగిల్చింది.

owning a house సొంతింటి కల కూటమిపైనే ఆశ!
సాలూరులో టిడ్కో గృహ సముదాయం

  • పార్వతీపురంలో పూర్తికాని టిడ్కో ఇళ్ల నిర్మాణం

  • ఎన్నికలకు ముందు సాలూరులో పంపిణీ

  • మౌలిక వసతులు మాత్రం కల్పించలే..

  • ఆ ప్రాంతంలో ఒక్కరూ గృహ ప్రవేశం చేయని వైనం

  • గతంలో డబ్బులు చెల్లించిన వారికి గృహాలు కేటాయించని పరిస్థితి

  • తలలు పట్టుకుంటున్న లబ్ధిదారులు

  • కూటమి ప్రభుత్వం స్పందించాలని విన్నపం

పార్వతీపురం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పేదలకు గూడు లేకుండా చేసింది. వారు చెల్లించిన డబ్బులు వాపస్‌ చేయకుండా అప్పుల ఊబిలోకి నెట్టింది. గత ఐదేళ్లూ పార్వతీపురంలో గృహ నిర్మాణాలను పూర్తి చేయించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు తీరని వేదనను మిగిల్చింది. సాలూరులో మాత్రం ఎన్నికల ముందు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినా.. మౌలిక వసతులు కల్పించలేదు. టిడ్కో గృహ సముదాయానికి వెళ్లేందుకు సరైన రహదారిని కూడా నిర్మించలేదు. దీంతో అక్కడ ఒక్కరు కూడా నివాసం ఉండడం లేదు. మిగిలిన లబ్ధిదారులకు డబ్బులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో చాలామందికి సొంతింటి కల నెరవేరలేదు. ప్రస్తుతం ఇటువంటి వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.

సాలూరు: సాలూరు మున్సిపాల్టీ పరిధి చంద్రంపేట సమీపంలో సుమారు 14 ఎకరాలను సేకరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,440 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. మొత్తంగా 28 బ్లాకుల్లో 1,228 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.98.48 కోట్లతో 300 చదరపు గజాలు ఉన్న 1052 గృహ నిర్మాణాలను పూర్తి చేసి ఎన్నికల ముందు హడావుడిగా పేదలకు అప్పగించారు. అయితే ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయలు కల్పించలేకపోయారు. టిడ్కో గృహ సముదాయాల్లో విద్యుత్‌, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం అక్కడ ఎవరూ నివాసం ఉండడం లేదు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్లడానికి సరైన రహదారి కూడా లేకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ఇకపోతే 421 మందికి సుమారు రూ.64 లక్షల చెల్లించాల్సి ఉండగా 356 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మాత్రమే రూ.30 లక్షలు జమ చేశారు. ఇక మిగిలిన వారికి ఇల్లు కేటాయించకపోవగా.. వారు కట్టిన డబ్బులు తిరిగి వాపస్‌ ఇవ్వలేదు. దీంతో ఆయా లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపాయి చెల్లించిన వారి ఇళ్లను సుమారు 50 శాతం నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత పాలనాపగ్గాఉ చేపట్టిన వైసీపీ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఐదేళ్లలో మిగతా 50 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తి చేసింది. మౌలిక వసతుల కల్పనను మరిచిన గత ప్రభుత్వం.. రూ.12,500, రూ.25వేలు, రూ.500 చెల్లించిన వారికి సంబంధించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించలేకపోయింది.

ఇల్లు ఇవ్వలేదు

టిడ్కో ఇల్లు వచ్చిందని గత ఐదేళ్లుగా అధికారులు, నాయకులు తిప్పించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు కానీ స్థలం కానీ ఇవ్వలేదు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలి. మా లాంటి వారికి న్యాయం చేయాలి.

యు.వరలక్ష్మి, సాలూరు

=========================

ఆ ఇంట్లో ఉండట్లే..

నాకు టిడ్కో ఇల్లు ఇచ్చారు కానీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆ ఇంటికి తాగునీటి వసతి కూడా లేదు. దీంతో ఇంట్లో ఉండడం లేదు. కూటమి ప్రభుత్వం స్పందించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం.

- ముగడ నారాయణమ్మ, బంగారమ్మపేట, సాలూరు

=========================

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

టిడ్కో ఇళ్ల సముదాయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పూర్తిస్థాయిలో కాలువలు, రహదారుల నిర్మాణం చేపడతాం.

- సీహెచ్‌ సత్యనారాయణ ,కమిషనర్‌, సాలూరు మున్సిపాల్టీ


పార్వతీపురంలో ఇలా..

జిల్లా కేంద్రం పార్వతీపురంలో 336 మంది లబ్ధిదారులు సుమారు రూ.కోటి 75 లక్షలు చెల్లించారు. అయితే వారికి నేటికీ ఇళ్లు మంజూరు చేయలేదు. వారు కట్టిన డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ నిర్వాకంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతింటి కల నెరవేరుతుందనే ఉద్దేశంతో గతంలో అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించిన వారు నేడు వడ్డీలు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా అప్పట్లో రూ. 500 చెల్లించిన లబ్ధిదారుల పేర్లు మార్చేసి జాబితాలో వైసీపీ కార్యకర్తల పేర్లు చేర్చారు. కాగా ఈ ఏడాది జనవరి నాటికి టిడ్కో గృహాలు అందిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా.. పార్వతీపురం పట్టణానికి సమీపంలో ఉన్న అడ్డాపుశీల ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించలేకపోయింది. patanikparavathipuram tidco.gif

Updated Date - Dec 25 , 2024 | 12:46 AM