Share News

పోరాటం తప్పదు

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:06 AM

కేంద్ర ప్రభుత్వం అవ లంభిస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదని ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్‌ బి.దాసు, ఏపీ రైతు సంఘం నాయకు డు బి.అప్పలనాయుడు అన్నారు.

పోరాటం తప్పదు

పార్వతీపురటౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అవ లంభిస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదని ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్‌ బి.దాసు, ఏపీ రైతు సంఘం నాయకు డు బి.అప్పలనాయుడు అన్నారు. ఆదివా రం స్థానిక ఏపీ రైతు కూలీ సంఘ భవనంలో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. లేబరు కోడ్‌లను రద్దు చేసి, కనీస వేతనాలను ఇవ్వాలన్నారు. ఈనెల 24వ తేదీన పాలకొండ నుంచి వీరఘట్టాం, జియ్యమ్మవలస, మేరంగి, ఖడ్గవలస, పార్వతీపురం మీదుగా సీతానగరం వరకు బైకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. 26వ తేదీన జిల్లా కేంద్రం లోని పాతబస్టాండ్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శ న ర్యాలీలో కార్మిక, రైతులతో పాటు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనునా యుడు, వై.మన్మథరావు, జీవ, గంగునాయుడు, పి.రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:06 AM