Share News

పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాయే లక్ష్యం

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:38 PM

పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ వి.రవీంద్ర తెలిపారు. శనివారం పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల అఽధికారులతో సమీక్షిం చారు.

 పూర్తిస్థాయిలో  తాగునీటి సరఫరాయే లక్ష్యం
అధికారులతో సమీక్షిస్తున్న ఆర్డీ రవీంద్ర

పార్వతీపురం టౌన్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ వి.రవీంద్ర తెలిపారు. శనివారం పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల అఽధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏషీయన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వ్‌స్టుమెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా జిల్లా కేంద్రవాసులకు 2025లోగా పూర్తిస్థాయిలో తాగు నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని విఽధాలుగా ప్రయత్నిస్తుందన్నారు. మున్సిపాల్టీలో రహదారుల మరమ్మతులకు రూ.11 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.14 కోట్లు, తాగునీటి సరఫరాకు ముందస్తుగా రూ.90 లక్షలు మంజూరుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని రెవెన్యూ అఽఽధికారులను ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగం అఽధికారుల అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడితే సంబంధిత యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:38 PM