కుప్పలు తడిచి.. గింజలు మొలకెత్తి
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:08 AM
జిల్లాలో మూడురోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతు లకు అపారనష్టం వాటిల్లింది. పలు చోట్ల పంటపొలాల్లో పెట్టిన వరి కుప్పులు పూర్తిగా తడిచిపోవ డంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. మరికొన్నిచోట్ల వరి, అపరాల పంటలు దెబ్బతిన్నాయి. గింజలు తడవడంతో గింజలకు మొలకలు వస్తున్నాయి. అయిదే ఆదివారం వర్షం తెరిపివ్వడంతో పంటను రక్షించుకునే పనిలో రైతులు పడ్డారు.

గజపతినగరం డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మదుపాడ, తుమ్మికాపల్లి, శ్రీరంగరాజపురం కాళంరాజపేట తదితర గ్రామాల్లో నీటిలో ఉన్న పంటలను గట్లపై వేసి రైతులు ఆరబెడుతున్నారు. పలు గ్రామాల్లో వరి కంకులకు మొలకలు రావడంతోపాటు గింజలు తడవడంతో ధాన్యం రంగుమారిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. కోతలు కోసిన సమయానికి వర్షం కురవడంతో పంట పొలాల్లోని ఆదరా బాదరాగా కుప్పలుపెట్టారు.అయితే కొన్నిచోట్ల కుప్పల్లోకి నీరుచేరడంతో పంటలు పాడయ్యే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.
ఫశృంగవరపుకోట రూరల్ డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముషిడి పల్లిలో వర్షాలకు దెబ్బతిన్న వరిపంటను వ్యవసాయశాఖ సిబ్బంది పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.కోసి వదిలేసిన పంట పూర్తిగా తడిచి మొలకలు వచ్చాయని వాపోతున్నారు. తక్షణమే పంటను పరిశీలించి తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.